AP: సభల్లో, కార్యక్రమంలో తన కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయొద్దని సీఎం చంద్రబాబు గతంలో అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో అధికారులు సీఎం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం కోసం వేసిన కుర్చీకి తెల్లటి వస్త్రాన్ని అలంకరించారు. అది చూసి చంద్రబాబు ‘ఇలాంటివి వద్దన్నానుగా.. తీసేయండి’ అంటూ అధికారులఫై అసహనం వ్యక్తం చేశారు.