ప్రకాశం: ఉలవపాడు మండలంలోని బద్దిపూడి పంచాయితి సర్పంచ్ కూనం అనిల్ రెడ్డి(48) ఆదివారం హైదరాబాదులో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన కొద్ది రోజులుగా హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. వైద్యుల ప్రయత్నం ఫలించకపోవడంతో ఆదివారం ఉదయం హాస్పిటల్ లోనే తుదిశ్వాస విడిచారె. ఈరోజు సాయంత్రానికి ఆయన పార్థీవదేహం బద్దిపూడికి చేరుతుందని ఆయన సన్నిహితులు తెలిపారు.