GNTR: గుంటూరు టౌన్ వన్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గుంటూరు టౌన్ వన్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏల్చూరి ఏడుకొండలు అన్నారు. టౌన్ వన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నరసరావుపేటలో విధులు నిర్వహిస్తూ గుంటూరు బదిలీ అయ్యారు.