AP: సిరిమాను తరలింపు సందర్భంగా పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడలోని ఆలయంలో విశేష పూజలు చేశారు. సిరిమాను కోసం గుర్తించిన చెట్టును భూదేవి నుంచి వేరుచేసే క్రతువు ప్రారంభమైంది. ఈ క్రమంలో సిరిమానుకు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. కాగా.. ఈ నెల 14, 15వ తేదీల్లో పైడిమాంబ తొలేళ్లు, సిరిమానోత్సవం జరగనుంది.