AP: దశాబ్దాలుగా దివిసీమ ప్రజలు ఎదురుచూస్తున్న మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ నిర్మాణంపై ముందడుగు పడింది. ఈ లైన్ ఆవశ్యకతపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం మచిలీపట్నం నుంచి గుడివాడ, విజయవాడ మీదుగా తెనాలి చేరుకోవాలంటే 113 కి.మీ ప్రయాణించాలి. కొత్త లైన్ పూర్తైతే దూరం తగ్గి చెన్నై, తిరుపతి ప్రాంతాలకు వెళ్లేందుకు సులువు అవడంతో పాటు సరకు రవాణా చేసుకోవచ్చు.