కడప: ముద్దనూరు ఎంపీడీఓగా ముకుంద రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఇంచార్జ్ ఎంపీడీవో చంద్రమౌళీశ్వర్ వీరపునాయునిపల్లి ఏవోగా బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని కూటమి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలాన్ని అందరి సహకారంతో అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.