కోనసీమ: మల్కిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్కూల్ బెంచీలు లేక కింద కూర్చుని విద్యను అభ్యసిస్తున్నారని సర్పంచ్ హెలినా ఎమ్మేల్యే దేవ వరప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి విద్యశాఖ అధికారులతో మాట్లాడి స్కూల్ విద్యార్థులకు వారం రోజుల గడువులో బెంచీలు ఏర్పాటు చేశారు.