న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 359 మ్యాచ్‌లలో 18,213 పరుగులు సాధించాడు. 165 వన్డేల్లో 6,810 పరుగులు, 101 టెస్ట్‌ల్లో 8,828 పరుగులు, 93 T20ల్లో 2,575 పరుగులు చేశాడు. కాగా ఈ రికార్డ్ ఇంతకు ముందు రాస్ టేలర్(18,199) పేరుతో ఉండేది.