NZB: బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ ఏకచక్రేశ్వరా ఆలయ వద్ద గల శ్రీ ఏక చక్రేశ్వర గోశాలలో రేపు స్వచ్ఛ భారత- స్వచ్ఛ గోశాలకార్యక్రమం ఉదయం 7 గంటలకు నిర్వహిస్తున్నట్లు గో సేవప్రముఖ్ కాసులచిరంజీవి (చరణ్), గోశాలప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గోశాలను పరిశుభ్రం చేస్తామన్నారు. గోవులకుసేవ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.