జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై తమిళ స్టార్ హీరో, మక్కల్ నీది మయం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ప్రతిపాదన ప్రమాదకరమని, ఇందులో చాలా లోపాలు ఉన్నాయని తెలిపారు. దేశానికి ఇది అవసరం లేదని, భవిష్యత్తులో కూడా ఇది అనవసరమని వెల్లడించారు.