RGV- Kukkala Mayor: ‘కుక్కల మేయర్’ సాంగ్ రిలీజ్ చేసిన ఆర్జీవీ
హైదరాబాద్లో వీధి కుక్కలు(Dogs) ప్రజల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి దారుణ పరిస్థితి మీద ఆర్జీవీ(RGV) గతంలో రియాక్ట్ అయ్యారు. మరోసారి దీనిపై స్పందించారు. గతంలో ఓ చిన్నారిని వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో(Video) తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆ ఘటన మీద నటులు ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. రాజకీయ నాయకుల్లో కూడా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ వారే మాట్లాడారు.

ఆర్జీవీ రిలీజ్ చేసిన కుక్కల మేయర్ సాంగ్ ప్రోమో:
సీఎం కేసీఆర్(CM KCR), కేటీఆర్ కూడా అదొక సాధారణ వార్తలాగే వదిలేశారు. కానీ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) మాత్రం ఈ సంఘటనపై గట్టిగానే రియాక్ట్ అవుతూ వస్తున్నాడు. ఐదు వేల కుక్కలను మేయర్(Mayor) ఉన్న చోట పడేయాలని, అవి వెంటాడి కరిస్తే తప్పా మేయర్ కు విషయం తెలియదని ఆర్జీవీ(RGV) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మేయర్ కుక్కలకు అన్నం పెడుతోన్న ఫోటోలను ట్వీట్టర్ తో జత చేసి ఆర్జీవీ పోస్టు కూడా పెట్టడంతో అదికాస్తా వైరల్(Viral) అయ్యింది.
Respected @GadwalvijayaTRS I hope you and your dogs have seen this video ..I request you to atleast donate 5 laks into the KILLED BOY’s parents account and #JustifyPradeephttps://t.co/3V3eefzu6Z
ఇక ఈ విషయం గురించి అందరూ మర్చిపోతున్న తరుణంలో ఆర్జీవీ(RGV) మరోసారి ‘కుక్కల మేయర్’ అంటూ ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. రక్తచరిత్ర సినిమాకు మాదిరిగా కుక్కలు వెంటాడితే మీరేం చేస్తారు అంటూ ఆర్జీవీ(RGV) సాంగ్ ను పోస్టు చేశాడు. ఓ షార్ట్ ఫిలిం మాదిరిగా ఆర్జీవీ వీడియో సాంగ్ ను రిలీజ్(Song Release) చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.