ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఇలా లీకులకు తెర తీస్తున్నాయనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి.
బలగం(Balagam) చిత్రాన్ని కొంత మంది అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మూవీని పైరసీ చేసి గ్రామాల్లో ప్రదర్శించడంపై దిల్ రాజు(Dil Raju) పోలీసుల(police)కు ఫిర్యాదు చేశాడు. సిరికొండ గ్రామంలో బహిరంగంగా ప్రదర్శించారని అతనికి తెలియడంతో తమ ఆదాయానికి గండి పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర సమర్పకుడు దిల్ రాజు నిజామాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏమై ఉంటాయోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారమా? చదువు ఒత్తిడా? అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.
అధికారిపైనే కుక్క దాడి చేసిందంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా దెందులూరు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పైన ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పదకొండు మంది గాయపడ్డారు.
బెంగళూరు - వారణాసి ఇండిగో విమానం తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ఈ సినిమా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడంపై నిర్మాత దిల్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుకు ఎవరూ జంకడం లేదు. ఇది మా సినిమా అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేస్తున్నారు.
బీజేపీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోను... తన తండ్రి తనను ఎంతగానో చదివించాలని ఆశపడటంతో ఆ బాధలోను పదో తరగతి పరీక్షలు రాసి వచ్చాడు ఓ విద్యార్థి
దయాగుణుడైన ఎండీ మహిళ చెప్పినట్టు చేశాడు. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఆన్ లైన్ లో ఆ మహిళ ఏకంగా రూ.6.69 కోట్లు వసూలు చేసింది.
పదో తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో లీకేజీల పండగ జరుగుతోందని మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు కొశ్చన్ పేపర్ లీకయ్యింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్‌యూఐ ఏకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు 10వ తరగతి పరీక్షలు(10th question paper leaked) మొదలైన ఏడు నిమిషాలకై ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అక్కడి కలెక్టర్ నారాయణ రెడ్డి(narayana reddy) ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ చేయడంలో ఉపాధ్యాయుడు బందెప్ప పాత్ర ఉన్నట్లు పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు.
10th Exams : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ అయ్యిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అవ్వడం తీవ్ర దుమారం రేపాయి.
టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేద్దామని విపక్షాలను షర్మిల కోరారు. ఇందులో అన్నీ పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చెప్పారు. కోదండరాం అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పారు.