మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఇంతలో హైదరాబాద్‌లో మరో భారీ ప్లెక్సీ వెలిసింది. మోడీ కుటుంబం స్వాగతం చెబుతోంది అని పైన రాసి ఉంది. అందులో రాజకీయ నేతలు తండ్రులు/ కుమారులు- కుమార్తెలు ఉన్నారు.
పదో తరగతి హిందీ పేపర్ లీక్ జరిగడానికి కారణమైన స్టూడెంట్‌ను డిబార్ చేశారు. ఐదేళ్లపాటు పరీక్ష రాసేందుకు వీలులేదని డీఈవో స్పష్టంచేశారు. దీంతో బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. తన తప్పు ఏం లేదని చెబుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రం నుంచి నిలోఫర్( Niloufer ) వైద్య కాలేజీలో గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న కే పుష్ప( Nurse K Pushpa ) నర్సింగ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( IMC ) వారు ఢిల్లీ హెడ్ క్వార్టర్స్‌లో సమర్పన్ దివస్ నిర్వహించిన సందర్భంగా ఈ అవార్డులను అందించారు.
మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District)లో గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా (Corona) సోకింది. పాఠశాలలో జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్టులు (covid tests) నిర్వహించారు. వీరిలో 15 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటీవ్ గా తేలింది. విద్యార్థులు ప్రస్తుతం ఐసోలేషన్ (Isolation) లో చికిత్స పొందుతున్నారు.
సినీ నటి ఖుష్బు ప్లూతో బాధపడుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు.
తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్ (Sub Inspector) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించే తుది రాత పరీక్ష(written test) కు సమయం అసన్నమైంది. ఏప్రిల్ 8,9,వతేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరుకు, ఆప్టర్ నూన్ (After noon) 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరుకు ఎగ్జామ్ (Exam) జరగనున్నది.
తెలంగాణలో BRS పార్టీకి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేందుకు బీజేపీ(BJP) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల బెయిల్ పై విడుదలైన బండి సంజయ్(bandi sanjay)కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈ మేరకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటీ? అది కేసీఆర్, BRS పార్టీపై ఎలా ప్రభావం చూపుతుందని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్(KTR)ను ప్రభుత్వం నుంచి తొలగించాలని బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్రభుత్వం వెంటనే ఉద్యోగార్థులకు లక్ష రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తమ కుటుంబం గత 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) హుస్నాబాద్‌లో విషాదం జరిగింది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ(KMR Cricket Tournament) లో అపశృతి చోటు చేసుకుంది.కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ లో క్రికెట్ టొర్నీలో బౌలింగ్ చేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ (Heart stroke) తో శనిగరం అంజనేయులు (Anjaneyulu) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ చేశామని చెబుతూ.. కంటికి, పంటి చికిత్స కోసం ఎందుకు ఢిల్లీ వెళుతున్నారని అడిగారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీ లో చేరారు. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త జూటుర్ కీర్తిరెడ్డి(Jutur Kirti Reddy) కాషాయ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని ర్యాలీగా ఆమె పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆపై కిషన్ రెడ్డి, పలువురు నేతల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయనకు పోయే కాలం దగ్గరపడిందని చెప్పారు. అందుకే పోలీసుల చేత వేధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.
మా అమ్మ తర్వాత నన్ను కన్న కొడుకులా ఆమె చూసుకున్నది. ఆమె పిండం పక్షి ముట్టలే. మా కుటుంబమంతా బాధపడుతున్నది
తెలంగాణకు మీరు చేసిన ఒక్క మేలైనా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఏడాదిలో తెలంగాణకు వస్తున్న మీరు ఇప్పటివరకు ఏం చేశారని నిలదీశారు.