తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాను.. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టిన వ్యక్తి వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వం తీసుకోవాలా అని ప్రశ్నించారు జూపల్లి.
కోవర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్నారు పాల్వాయి స్రవంతి.
Minister KTR : ఏప్రిల్ 25న ప్రతి గ్రామంలో తమ పార్టీ జెండాలు ఎగరాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఆన్ లైన్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకోవద్దని సైబర్ నిపుణులు/ పోలీసులు పదే పదే చెబుతారు. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన ఓ యువతి రూ.9 లక్షలు తీసుకొని.. ఏకంగా రూ.44 లక్షలు కట్టింది.
పరస్పరం మాటలు నువ్వెంత అనుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ‘ఈ రోజు నుంచి చూపిస్తా’ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగగా.. ‘నువ్వేం చేయలేవు.. నీతోటి కాదు’ అని కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశాడు. వెంటనే పోలీసులు ప్రవేశించి పరిస్థితిని చక్కదిద్దారు.
మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Station) వెల్లడించింది. ఏప్రిల్ 12వ తేది నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
DK Aruna : బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్వాగతం పలికారు. కలిసి పనిచేద్దామంటూ ఆయనకు స్వాగతం పలికారు. ఫోన్ చేసి మరీ బీజేపీలో చేరమని ఆమె కోరడం గమనార్హం.
సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయం అయ్యింది. ఆమె వైద్యులను కలువగా.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఈ యువ నాయకులు సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. భవిష్యత్ లో మహారాష్ట్రలో బీఆర్ఎస్, శివసేన కలిసే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించి మత్తు పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ మత్తు పదార్థాల కొరత ఉంది. దీంతో మత్తు పదార్థాలను తక్కువ మోతాదులో కల్లులో కలుపుతున్నారు.
ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో రాష్ట్ర బీజేపీ(BJP) నేతలతో ఈ విషయాన్ని చర్చించినట్లుగా సమాచారం. అయితే ఈ వందేభారత్ ట్రైన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే ఇది కార్యరూపం దాల్చితే.. తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కానుంది.
ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుపై వేధింపులు సరికాదంటున్నారు.
భార్య తనను విడిచి వెళ్లిపోవడంతో శీనుకు కోపోద్రిక్తుడయ్యాడు. భార్య లేనప్పుడు పిల్లలు ఎందుకు అనుకున్నాడు. ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన వారి కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చి.. అందులో విషం కలిపి వారికి ఇచ్చాడు.
మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటించిన సరే.. సెల్పీల కోసం యువత ఆరాట పడతారు. కాదనకుండా వారికి సెల్ఫీ ఇస్తుంటారు. ఎల్లారెడ్డిపేటలో సెల్ఫీల కోసం జనం వస్తూనే ఉన్నారు. దీంతో మంత్రి సెల్ఫీ రూ.500 ఇవ్వాలని సరదాగా కామెంట్ చేశారు.