Etela Comments : పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ ఆయనను గంటపాటు విచారించారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ అంశంలో అరెస్టై, బెయిల్ మీద బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిందని చెబుతున్న తన మొబైల్.. సీఎం కేసీఆర్ వద్ద ఉందని చెప్పారు.
భాగ్యనగరానికి మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రానుంది. హైదరాబాద్ - బెంగళూరు మధ్య కొత్త రైలును నడపాలని చూస్తున్నట్లుగా సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(bandi sanjay) బలగం(balagam) మూవీని ఈరోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో(devi theatre hyderabad) వీక్షించారు. ఈ చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో బండి సంజయ్ పలువురు కార్యకర్తలతో కలిసి సినిమాను చూశారు.
pongulati Srinivas Reddy : బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది .. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే .. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వీరు ఇద్దరు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .. అయితే దానిపై పొంగులేటి మాట్లాడుతూ ..
భాగ్యనగరం మరో కీలక బిజినెస్ సదస్సుకు వేదికగా మారనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 16న హైదరాబాద్(hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్(Investor Business Summit) జరగనుంది.
ఈటెలను వరంగల్ డీసీపీ, ఏసీపీ గంటపాటు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు వాట్సప్(Whatsaap) ద్వారా ప్రశ్నపత్రాన్ని పంపించాడు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేశారు.
కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా ఏపీ సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. ఫ్యాక్టరీని విక్రయించొద్దు అనే ఒక్క మాట జగన్ కానీ, వైఎస్సార్ సీపీ కానీ అనలేదు.
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్ ...
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
చిత్రవిచిత్ర వేషాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఎక్కడ మీడియా కనిపించినా హడావుడి చేస్తున్న పాల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం అతడి పిచ్చి ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తోంది.
పార్టీలోని అసంతృప్తి నాయకులు తలనొప్పిగా మారారు. అయితే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వింటే పార్టీలో కొనసాగింపు చేస్తున్నారు. లేదంటే నిర్మోహమాటంగా సస్పెండ్ లు చేస్తున్నారు.