కేంద్ర బీజేపీ ప్రభుత్వం సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్, సిసిసి కార్నర్ వద్ద శనివారం మహా ధర్నా పెద్ద ఎత్తున జరిగింది. సింగరేణి ప్రాంతంలో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రె...
తెలంగాణ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల అద్భుతంగా రూపుదిద్దుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా తీర్చిదిద్దారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ఈ విగ్రహా నిర్మాణం చేపట్టారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున మరో సందర్శనీయ స్థలంగా అంబేడ్కర్ విగ్రహం నిలువనుంది.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభానికి ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీ బేంగపేట విమానాశ్రయంలో దిగారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వైష్ణవ్ తదితరులు స్వాగతం పలికారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో మరో ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిద్దరిని లౌకిక్, సుష్మితగా గుర్తించారు. లౌకిక్ సాయి తన భార్య సుష్మిత కోసం ప్రధాన అనుమానితుడైన ప్రవీణ్ నుంచి DAO పరీక్ష ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశాడు. సిట్ విచారణలో గతంలో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు(police) వారిని అరెస్టు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా నిధులు ప్రకటించాలని కోరుతున్నాం. మీ రాజకీయ స్వార్థం కోసం ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం.
ప్రకృతి వైద్యానికి తెలంగాణ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి హారీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. ప్రకృతి వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా సీఎం కేసీఆర్ (CM KCR) కృషి చేశారని హారీశ్‌రావు తెలిపారు .సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా పనిచేస్తున్నదని వెల్లడించారు.
పని చేస్తున్న వాళ్లతో కొంతమంది ఇబ్బందులు కొందరు వారి స్వలాభం కోసం పని చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల నేను కఠినంగా వ్యవహరిస్తా.
తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్(hyderabad) వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) కార్యక్రమానికి సీఎం కేసీఆర్(cm kcr) ఐదోసారి హాజరుకాలేదు. బేగంపేట విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్‌ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్‌ను పంపారు. దీంతో ఈ అంశంపై నెటిజన్లు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని పలు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రిమోట్ ద్వారా చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు.
Drunk Passenger Tries To Open Emergency Door On Bengaluru-Bound IndiGo Flight
అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఇది అధికారిక కార్యక్రమం కావడంతో సీఎం కేసీఆర్, స్థానిక మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా కుర్చీలు వేశారు.
స్థానిక ప్రజాప్రతినిధులు కావడంతో ప్రొటోకాల్ ప్రకారం వారికి స్థానాలు కల్పించారు. వీరిద్దరూ మోదీ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
Telangana Govt : తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇక నుంచి వ్యాపారులు తమ దుకాణాలను 24గంటలు తెరచి ఉంచుకోవచ్చు. 24/7 షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతినిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఏడాదికి రూ.10 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.