NLG: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా చిట్యాలలోని పలు పాఠశాలల్లో రవాణా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. కిరణ్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి విద్యార్థులకు వివరించారు. వీటి పట్ల విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియపరచాలని కోరారు.