NZB: ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా నిజామాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింర్థియన్ మావి, డీఆర్డీఓ పీడీ సాయి గౌడ్లతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.