KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం వంటి అనేక వసతులు ఉన్నాయని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అరుణ అన్నారు. మంగళవారం మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం 2025-26 విద్యా సం. అడ్మిషన్లకు గాను ముస్లిం మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలను సందర్శించారు. ఎంతో నిష్ణాతులైన అధ్యాపక బృందం ఇక్కడ పనిచేస్తుందని పేర్కొన్నారు.