NZB: మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని వాలీబాల్ పోటీలను నర్సింగ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ నిర్వహిస్తున్నట్లు SI సుస్మిత ఆదివారం తెలిపారు. యువత, పిల్లలు గంజాయి, మత్తు పదార్థాల దూరంగా ఉండాలని, మంచి జీవన శైలిని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.