టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ప్రేయసి మేహ పటేల్‌ను జవనరి 26న వడోదరలో వివాహం చేసుకున్నాడు. ఆయన తన వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు అందమైన జంట అంటూ కామెంట్లు పెడుతున్నారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం వీళ్ల వివాహం జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో తమ అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయ పడడంతో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. బంతితో, బ్యాటుతో రాణించి, జడ్డూ లేని లోటు తెలియకుండా చేశాడు. స్వదేశంలో శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ గెలవడంలో అక్షర్ కీలక పాత్ర పోషించాడు. దాంతో, అతడు ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. రెండు టెస్టులకు 17మందితో ప్రకటించిన జట్టులో బీసీసీఐ ఈ ఆల్‌రౌండర్‌కు చోటు కల్పించింది.