ఢిల్లీలో లిక్కర్ స్కాం ఘటన మరువక ముందే తాజాగా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో లిక్కర్ కుంభకోణం(liquor scam) వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఢిల్లీలో స్కాం కంటే ఇది పెద్దదని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ దందాలో ప్రధాన నిందితుడు ధేబర్ సహా పలువు అగ్ర రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్లు ఈడీ చెబుతోంది.
కేరళ స్టోరీ(The Kerala Story) ఓ విషపూరిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp adda) అన్నారు. తుపాకులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో కూడిన ఉగ్రవాదం గురించి మనం విన్నాం. కానీ ఇది మరొక ప్రమాదకరమైన ఉగ్రవాదమని వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన సందర్భంగా నడ్డా ఈ కామెంట్స్ చేయడం విశేషం.
కేరళలో (Kerala) ఘోర ప్రమాదం (Tragedy) చోటుచేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న డబుల్ డెక్కర్ పడవ (Boat) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏకంగా 22 మంది మరణించారు. మృతుల్లో అత్యధికంగా చిన్నారులు (Children) ఉండడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ సంఘటనపై ప్రధాని మోదీ (Modi), ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కూప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. అయితే విమానం పైలట్ మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోగా తెలంగాణకు చెందిన ఓ టెక్నిషియన్ మృతి చెందారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని ...
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు(naga babu konidela) ఏపీ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మాల్ లోని స్మాష్ బౌలింగ్ గేమింగ్ ప్లే జోన్ లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారి రోబోటిక్ స్పేస్ షటిల్ మిషీన్ వద్దకు వెళ్లింది. అయితే ఆ మెషీన్ వెనుక భాగం తెరిచి ఉంది. అది కూడా ఆడుకునేదిగా భావించి ఆ యంత్రం లోపల చేయి పెట్టగా చేతివేళ్లు నుజ్జనుజ్జయ్యాయి. గట్టిగా రోదించడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు.
భారత్ రాష్ట్ర సమితికి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన పార్టీలు బీఆర్ఎస్ లో విలీనమవుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ విలీనం కాగా తాజాగా మరో పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది.
మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ బీసీ జనగణన చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజస్థాన్ భారీ స్కోర్ చేయడం తో దాదాపు గెలుపు ఆ టీమ్ కే దక్కుతుందని అనుకున్నారు. అందులోనూ ఈ మధ్య వరస మ్యాచుల్లో సన్ రైజర్స్ ఓడిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో.. అందరూ రాజస్థాన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ సన్ రైజర్స్ మ్యాచ్ మొత్తం తిప్పేసింది.
ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త పనులు చేపట్టవచ్చు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్టుపై విజయం సాధించింది.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
మణిపూర్లో(manipur) చిక్కుకున్న ప్రతి ఏపీ విద్యార్థిని(ap students) తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) స్పష్టం చేశారు. ప్రత్యేక విమానంలో అక్కడ ప్రస్తుతం ఉన్న 157 మంది ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు.
ఖమ్మం జిల్లాలోని 49 ఏళ్ల వ్యక్తి రాయల సతీష్ తన 17 ఏళ్ల కూతురితో కలిసి నీట్ పరీక్ష రాశాడు. ఎంబీబీఎస్ పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలిపాడు.
రేపు(మే 8న) కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi vadra) హైదరాబాద్(hyderabad) రానున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్(ktr) కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం చెబుతుందని అన్నారు.