AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో ONGC గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన.. మంటల నియంత్రణకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. 25 శాతం ప్రెజర్ తగ్గిందని అధికారులు ఆయనకు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రానికి మంటలు అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉందని అచ్చెన్న మీడియాకు తెలిపారు.