»Kailash Gahlot Ed Notices To Another Minister In Liquor Scam Case
Kailash Gahlot: మద్యం కుంభకోణం కేసులో మరో ఆప్ మంత్రికి ఈడీ నోటీసులు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా మరో మంత్రికి ఈడీ నోటీసులు పంపింది.
Kailash Gahlot: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా మరో మంత్రికి ఈడీ నోటీసులు పంపింది. ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్కు ఈడీ ఈరోజు నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం దర్యాప్తు సంస్థ ఎదుట ఈరోజే హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన పలు అంశాలపై విచారించేందుకు రావాల్సిందిగా ఈడీ తెలిపింది.
దీంతో కైలాశ్ గహ్లోత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అతనిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రస్తుతం గహ్లోత్ కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం విధానంపై ముసాయిదాను తయారు చేసే సమయంల అప్పటి ఆప్ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ విజయ్ నాయర్, గహ్లోత్ అధికారిక నివాసాన్ని వినియోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రిటైలర్లకు దాదాపు 185 శాతం, టోకు వ్యాపారులకు 12 శాతం అధిక లాభాలను అందించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ పేర్కొంది. అలాగే 600 కోట్లకు పైగా లంచాలు ఇచ్చినట్లు ఈడీ అనుమానిస్తోంది.