రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో కన్నీరు మున్నీరయ్యారు ప్రభాస్. అయితే అంత బాధలోనూ ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు అభిమానులు. మామూలుగానే కృష్ణంరాజు ఆతిథ్యాన్ని తట్టుకోవడం కష్టమంటుంటారు ఇండస్ట్రీ ప్రముఖులు. అలాగే ప్రభాస్ కూడా అలాంటి ఆతిథ్యానికి ఏ మాత్రం తీసిపోడు. అందుకే కృష్ణంరాజును చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్క అభిమాని భోజనం చేసేలా చూడాలని చెప్పారట ప్రభాస్. గత రెండు మూడు రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘రాజు ఎక్కడున్న రాజేనని’ అంటూ కాలర్ ఎగరెస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా.. శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ స్టోరీ లైన్‌తో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ‘ప్రాజక్ట్ కె’ టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.. అందుకే శర్వా సినిమా కథతో లింక పెట్టేశారు కొందరు. కాకపోతే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి పుకార్లపై కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. డైరెక్ట్‌గా రెస్పాండ్ అవకపోయినా.. ఇండైరెక్ట్‌గా స్పందించాడు.
‘ప్యారడైస్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరు’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు నాగ్ అశ్విన్. దాంతో టైం ట్రావెల్ కథతో వచ్చే సినిమాలన్ని ఒకేలా ఉండవని.. ఎవరి దారి వారిదని చెప్పినట్టే ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కాబట్టి ప్రాజెక్ట్ కె కథ విషయంలో పుకార్లకు చెక్ పడిందనే చెప్పొచ్చు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు.