ప్రభాస్ ‘రాజాసాబ్’లోని ‘నాచే నాచే’ పాట తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటను మెయిన్ స్టోరీలో కాకుండా.. కేవలం ఎండ్ క్రెడిట్స్‌లో మాత్రమే ఉంచుతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై దర్శకుడు మారుతి స్పందించాడు. ఈ పాటను ఎండ్ క్రెడిట్స్‌లో వాడటం లేదని, ఇది సినిమాలో భాగమేనని చెప్పాడు. ఇక ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది.