• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు సొసైటీ ఖాతాదారుల సర్వసభ్య సమావేశం

GNTR: ది కాకతీయ కో-ఆపరేటివ్ సొసైటీ తెనాలి ఖాతాదారుల సర్వసభ్య సమావేశాన్ని 22వ తేదీ నిర్వహిస్తామని ఛైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు శనివారం తెలిపారు. తెనాలిలోని సొసైటీ ఛైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. తమ ఖాతాదారుల సర్వసభ్య సమావేశాన్ని నేడు ఎన్జీవో కల్యాణ మండపంలో నిర్వహిస్తామని తెలిపారు.

September 22, 2024 / 04:21 AM IST

’24న ఓటర్ల జాబితా డ్రాఫ్టు పబ్లికేషన్ విడుదల’

ప.గో: రాష్ట్ర శాసన మండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా డ్రాప్టు పబ్లికేషన్ ఈనెల 24న విడుదల చేయబడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.

September 22, 2024 / 04:21 AM IST

పిల్లలను బాణసంచా తయారీలో ఉపయోగిస్తే కఠిన చర్యలు: జేసీ

WG: ప్రభుత్వ అనుమతులు లేకుండా మందు గుండు సామాగ్రి తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో మందు గుండు సామాగ్రి తయారు చేసే యూనిట్లను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలను బాణసంచా తయారీలో ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

September 22, 2024 / 04:20 AM IST

23న పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

PLD: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీహెచ్సీ. వైద్యాధికారి డాక్టర్ విద్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈసీజీ రక్త పరీక్షలు, నిర్వహిస్తారని డాక్టర్ తెలిపారు.

September 22, 2024 / 04:19 AM IST

దేవనకొండ PHCలో ఆశాదినోత్సవం

కృష్ణా: దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆశా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పని భారం తగ్గించాలని కోరారు. పత్తికొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి సాయిబాబా, ఏఎన్ఎంలు, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి హనుమంతమ్మ, రంగస్వామి, శ్రీధర్ స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

September 22, 2024 / 04:19 AM IST

‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ప.గో: కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలిపారు.

September 22, 2024 / 04:18 AM IST

సోమవారం మంగళంలో చల్లా పర్యటన

CTR: పుంగనూరు మండలం మంగళం పంచాయతీలో సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు టీడీపీ కార్యాలయం తెలిపింది. ఉదయం 9.30 గంటలకు జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

September 22, 2024 / 04:15 AM IST

విజయవాడలో నాలుగు బైకులు స్వాధీనం

కృష్ణా: విజయవాడ సత్యనారాయణపురంలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు సత్యనారాయణపురం సీఐ బాల రాజాజీ తెలిపారు. విజయవాడకు చెందిన హేమంత్ కుమార్ కుట్టి అనే వ్యక్తి ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడన్నారు. ద్విచక్ర వాహనాలు మాయమయ్యాయని పలు ఫిర్యాదులు రావడంతో నిఘా ఏర్పాటు చేసి ఇతనిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

September 22, 2024 / 04:15 AM IST

తణుకు రూరల్‌ సీఐగా కృష్ణకుమార్‌ బాధ్యతలు

W.G: తణుకు రూరల్‌ సీఐగా బర్రే కృష్ణకుమార్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కైకలూరు రూరల్‌ సీఐగా పనిచేస్తున్న కృష్ణకుమార్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన జీవీవీ నాగేశ్వరరావును వీఆర్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణకుమార్‌ మాట్లాడుతూ.. తణుకు సర్కిల్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.

September 22, 2024 / 04:14 AM IST

టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు

NLR: రూరల్ పరిధిలోని 32, 35, 41 డివిజన్ వైసీపీ కార్పొరేటర్లు శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అవినాశ్, వాసంతి, విజయలక్ష్మి, 35వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ శరత్ చంద్ర, 41వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ బార్జి చేరిన వారిలో ఉన్నారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాడు.

September 22, 2024 / 04:14 AM IST

విద్యార్థినికి ఎంపీ వేమిరెడ్డి ఆర్థిక సహాయం

NLR: రూరల్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కొండల రావు కుమార్తె తారక లక్ష్మి భవానికి MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చదువు నిమిత్తం రూ. 35 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. 10వ తరగతిలో మంచి మార్కులతో ప్రతిభ కనపరిచిన విద్యార్థినికి ఉన్నత చదువులకోసం ఆర్థిక సహాయం చేశారు. ఆయనకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.

September 22, 2024 / 04:13 AM IST

ఊటుకూరులో తాటాకిల్లు దగ్ధం

కృష్ణా: ఊటుకూరు శివారు నారాయణపురంలోని తోట చక్రవర్తికి చెందిన ఒంటి నెట్టాడు తాటాకిల్లు శనివారం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ దగ్ధమైంది. దీంతో రూ.3 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లింది. చక్రవర్తి వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్లగా ఆయన భార్య బంగారమ్మ మనవడుని అంగన్వాడీకి తీసుకువెళ్లింది. ఆసమయంలో విద్యుత్తు షార్ట్ సర్య్కూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు వ్యాప్తించాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

September 22, 2024 / 04:12 AM IST

‘తిరుమల లడ్డూ వివాదంలో నిందితులను కఠినంగా శిక్షించాలి’

ELR: తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కోరారు. శనివారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో గన్ని మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో నిందితులను ఉరి తీసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.

September 22, 2024 / 04:10 AM IST

మావుళ్లమ్మకు 8 గ్రాముల బంగారం విరాళం

WG: భీమవరంలో కొలువైన శ్రీశ్రీ మావుళ్లమ్మకు పట్టణానికి చెందిన శ్రీనివాస రోహిత్ 6 గ్రాములు బంగారం, అచ్యుతరామరాజు 2 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి పాల్గొన్నారు.

September 22, 2024 / 04:09 AM IST

ఘనంగా శ్రీవారికి పల్లకి సేవ

నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.

September 22, 2024 / 04:09 AM IST