»Indian Stock Market Crashes On Profit Booking On 28 September 2023 Fmcg It Index Midcap Stocks Falls Sharply
Stock Market Closing : కుప్పకూలిన స్టాక్ మార్కెట్ .. సెన్సెక్స్ 600, నిఫ్టీ 200 పాయింట్లు లాస్
వరుసగా మరో రోజు స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. ఎఫ్ఎంసిజి, ఐటి, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ ఫ్లాట్ అయింది. నేటి సెషన్లో మిడ్‌క్యాప్ స్టాక్‌లలో కూడా అమ్మకాలు కనిపించాయి.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
Stock Market Closing : స్టాక్ మార్కెట్లకు వారం రోజులుగా గడ్డు కాలం నడుస్తోంది. నిన్న కాస్త బాగానే ఉందనుకున్న నేటి ట్రేడింగ్ సెషన్ తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ఇన్వెస్టర్లు చాలా నిరాశ పడ్డారు. వరుసగా మరో రోజు స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. ఎఫ్ఎంసిజి, ఐటి, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ ఫ్లాట్ అయింది. నేటి సెషన్లో మిడ్‌క్యాప్ స్టాక్‌లలో కూడా అమ్మకాలు కనిపించాయి. మార్కెట్ ముగిసిన తర్వాత బిఎస్ఇ సెన్సెక్స్ 610 పాయింట్లు పడిపోయి 66,000 దిగువన 65,508 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 193 పాయింట్ల పతనంతో 19,523 పాయింట్ల వద్ద ముగిసింది.