TS EAMCET: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల..పరీక్షా తేదీలివే
ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్(Ts Eamcet) షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) కానున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.
ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్(Ts Eamcet) షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) కానున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది. మార్చి 3వ తేది నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ల(Online Applications) స్వీకరణ స్వీకరించనున్నారు. ఆన్ లైన్ అప్లికేషన్ స్వీకరణకు ఏప్రిల్ 30వ తేది చివరి తేదీ అని విద్యాశాఖ వెల్లడించింది.
మే నెల 2వ తేది నుంచి 4వ తేదీ వరకూ అప్లికేషన్ ను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అలాగే రూ.250ల లేట్ ఫీజుతో మే 5వ తేది వరకూ అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. రూ.1000ల లేట్ ఫీజుతో మే 10వ తేది వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. రూ.2500 లేట్ ఫీజుతో మే 15వ తేది వరకూ ఎంసెట్(Eamcet)కు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
రూ.5000 లేట్ ఫీజుతో మే 24వ తేది వరకూ ఎంసెట్(Eamcet)కు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది. మే 21వ తేది ఆన్ లైన్ లో ఎంసెట్ హాల్ టికెట్లు(Eamcet Hall Tickets) అందుబాటులోకి వస్తాయి. మే 7, 8, 9వ తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు, మే 10, 11వ తేదిన అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది.
ఎంసెట్(EAMCET) పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి సెషన్ నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ రెండవ సెషన్ పరీక్షలు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు(Eamcet Fee)ను రూ.500గా నిర్ణయించగా ఇతర విద్యార్థులకు మాత్రం ఎంసెట్ ఫీజు రూ.900గా నిర్ణయించినట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది.