పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పంజాబ్లోని పఠాన్కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జమ్మూలోని సాంబా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. కీలక సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.