ఆనంతపురం జిల్లాలో ఈ నెలాఖరు వరకు అవసరమైన దానికంటే ఎక్కువగా 5,249 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి రవి తెలిపారు. సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.