ELR: పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – సెర్ప్ ఆధ్వర్యంలో పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించి 800 యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధి సాధికారతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.