W.G: లక్ష్మణేశ్వరం బాడవలో పురపాలక సంఘ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయవద్దని గ్రామస్థలు నరసాపురం ఉప తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు సోమవారం వినతి ఇచ్చారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేసినట్లయితే గ్రామస్థులు రోగాల బారిన పడతారని, పరిసర ప్రాంతాల్లోని ఆక్వా చెరువులకు నష్టం వాటిల్లుతుండన్నారు. యార్డును మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు.