E.G: నగరాన్ని క్రీడా హబ్‌గా మార్చేందుకు MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్ అన్నారు. నగరంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.13.76 కోట్లు మంజూరు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు సోమవారం రాజమండ్రిలో MLA, MP పురందేశ్వరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.