MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం విజయోత్సవ సభను మంగళవారం మంచిర్యాల బస్ స్టేషన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ.. మహిళలు, ట్రాన్స్ జెండర్ల ఉచిత బస్సు ప్రయాణంతో సుమారు రూ.10 వేల కోట్ల మేర పొదుపు, రూ.290 కోట్ల జీరో టికెట్లు నమోదుతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని తెలిపారు.