CTR: సామాజిక పెన్షన్లు బుధవారం పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి 2,33,645 మంది లబ్ధిదారులకు రూ.100.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఉదయం 6.30 నుంచి స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు కార్యాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దకెళ్లి అందజేయనున్నట్లు తెలిపారు.