ఒక వ్యక్తి జేబులో సెల్‌ఫోన్ పేలిన ఘటన రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జరిగింది. గోపాల్ అనే చిరు వ్యాపారి తన ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ నుంచి పొగలు రావడాన్ని గమనించి దాని బయటకు తీసేందుకు యత్నించారు. కానీ అంతలోనే ఫోన్ పేలడంతో అతని చేతికి, తొడకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించడంతో అత్యవసర చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వార్తలు
జేబులో పేలిన ఫోన్.. తీవ్ర గాయాలు


