GNTR: తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాల రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని త్రీ టౌన్ పోలీసులు గుర్తించారు. సుమారు 50-55 ఏళ్ల వయసున్న మృతుడు నీలం రంగు లుంగీ, కండువా ధరించి ఉన్నట్లు త్రీ టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. మృతుని ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
క్రైమ్
తెనాలిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం


