KRNL: ఆదోని ఇస్వీ పోలీస్టేషన్ పరిధిలో పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన అవులప్పకు మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో 3రోజుల జైలు శిక్ష పడినట్లు ఇస్వీ SI మహేష్ కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడంతో నిందితుడిని ఆదోని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. విచారణ చేసి, 3 రోజుల సాధారణ జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు.
వార్తలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష: ఎస్సై


