ELR: రాష్ట్ర డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్ర ఈనెల 11న ఏలూరులో పర్యటించనున్నారని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు, ప్రజల నుంచి ఆయన అభిప్రాయాలు, వినతులను స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
వార్తలు
రేపు జిల్లాకు డెడికేటెడ్ కమిషన్ ఛర్మన్ రాక..!


