హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ పేలుడు.. ఏకంగా ఏడుగురు సజీవదహనం

రాజస్థాన్ జైపూర్‌లో ఘోరం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న టపాసుల గోదాములో భారీ పేలుడు సంభవించి ఏడుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. తలాయ్ కాలనీలో ఓ ఇంట్లో టపాసులను అక్రమంగా నిల్వ ఉంచగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు వేగంగా వ్యాపించాయి. లోపల పనిచేస్తున్న కార్మికులు బయటకు రాలేక మంటల మధ్య చిక్కుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.