హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీకి అమెరికన్ సింగర్ విషెస్

దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా నిలిచిన మోదీకి ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఐక్యత, అభివృద్ధి, ఆకాంక్షలకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు. దేశాన్ని పురోగతి వైపు నడిపించడంలో మోదీ దార్శనికత కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.