హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామసభ బహిష్కరించిన కౌన్సిలర్

MLG: అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఎన్నికైన ప్రజాప్రతినిధుల పేర్లు నమోదు చేయడం లేదని ఆరోపిస్తూ 18వ వార్డు కౌన్సిలర్ బైకని అనూష సాగర్ గ్రామసభను బహిష్కరించారు. కౌన్సిలర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శిలాఫలకాలపై ప్రజాప్రతినిధుల పేర్లు నమోదు చేసే వరకు గ్రామసభలకు హాజరుకాబోమని ప్రకటించారు.