SRPT: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని దోసపహాడ్ ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం మామిడి వెంకన్న అన్నారు. ఈరోజు గ్రామంలో జరిగిన బడిబాట ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన విద్యతో పాటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు ఉచితంగా అందుతున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని అన్నారు.
వార్తలు
సర్కారు బడులను బలోపేతం చేద్దాం: హెచ్‌ఎం వెంకన్న


