హైదరాబాద్: 28°C
వార్తలు

స్టీల్‌ప్లాంట్‌ బాధితులను పరామర్శించనున్న జగన్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఇప్పటికే ఆయన పార్టీ నేతలను ఆదేశించారు.