హైదరాబాద్: 28°C
క్రీడలు

మరిన్ని టైటిళ్లు సాధించడమే లక్ష్యం: జెమీమా

ఇంగ్లాండ్‌ వేదికగా శుక్రవారం నుంచి 12 జట్లతో మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ జట్టు నమ్మకాన్ని వ్యక్తం చేసింది. గత వన్డే ప్రపంచకప్‌ గెలిచిన అనుభవం, ఒత్తిడిని అధిగమించే నైపుణ్యం అందరికీ ఉన్నాయంది. ఒక కప్పుతో ఆగిపోకుండా మరిన్ని టైటిళ్లు సాధించడమే లక్ష్యమని జెమీమా ధీమా వ్యక్తం చేసింది.