హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి'

KDP: పెన్నానది తీర ప్రాంతాల్లో అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సిద్ధవటం మండలంలో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ముమ్మడిగుంటపల్లి,బ్రాహ్మణపల్లి మార్గాల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకుని అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.