KMR: నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కీసరి శ్రీనివాస్ (25) ఉదయం కాలకృత్యాల కోసం స్థానిక ఊర చెరువు వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి సోదరుడు రాజారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.