హైదరాబాద్: 28°C
క్రీడలు

వార్మప్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఘన విజయం

డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ చివరి వార్మప్ మ్యాచ్‌లో ఐస్‌లాండ్‌పై 3-0తో విజయం సాధించింది. మార్టినేజ్, థియాగో అల్మాడా, మెస్సీ తలో గోల్ చేశారు. మెస్సీ కెరీర్‌లో ఇది 117వ గోల్ కావడం విశేషం. కాగా, మెస్సీ సేన ఫిఫా ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ను జూన్ 16న అల్జీరియాతో ఆడనుంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రియా, జోర్డాన్ కూడా ఉన్నాయి.