KDP: వేంపల్లె మండలం అమ్మగారిపల్లెలో నెలకొన్న నీటి సమస్యలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని గ్రామస్థులు TDP ఇంఛార్జ్ రఘునాథరెడ్డికి TDP కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామస్థుల విన్నపంపై రఘునాథరెడ్డి సానుకూలంగా స్పందించి, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. రేపటి నుంచే నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.